సంజయ్ దత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కేడీ. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తోంది కన్నడ పరిశ్రమ. బెంగుళూరు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ బాంబ్ పేలుడు సీన్ తెరకెక్కిస్తుండగా సంజయ్‌దత్‌కి గాయాలు అయ్యాయట. మణికట్టుకి, చేతికి, ముఖానికి బాగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో కొన్నాళ్లపాటు షూటింగ్‌కి విరామం ప్రకటించారు మేకర్స్. ఫైట్ మాస్టర్ డాక్టర్ రవి వర్మ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. బెంగుళూరు మగది రోడ్‌లో ఈ ఘటన జరిగింది. సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. కేజీయఫ్1, కేజీయప్2తో సంజయ్‌దత్ కన్నడిగులకు బాగా సెంటిమెంట్‌గా మారిపోయారు. ధ్రువ సర్జా నటిస్తున్న కేడీలోనూ అందుకే సంజయ్‌ని సెలక్ట్ చేసుకున్నారు.
యాక్షన్ హీరోగా నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న నటుడు సంజయ్ దత్. విలన్‌గా ఆయన పోషించిన పాత్రలకు లెక్కేలేదు. ఇప్పుడు కూడా ఆయన స్క్రీన్ మీద ఉన్నారంటే ఆ వైబ్రేషన్స్ వేరే రేంజ్‌లో ఉంటాయంటారు మేకర్స్.
కేడీ సినిమా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. 1970లోబెంగుళూరులో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కేడీలో వి.రవిచంద్రన్, శిల్పాశెట్టి కూడా నటిస్తున్నారు. సంజయ్ దత్ కోలుకునేవరకు విజయ్ సినిమా లియో షూటింగ్‌కి కూడా ఆటంకం కలుగుతుంది. లియోని ఇటీవల కశ్మీర్‌లో తెరకెక్కించారు. త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ సినిమాలోనూ సంజయ్ దత్ కీ రోల్ చేస్తున్నారు.